ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అదిరే అభి చిత్రం

నటుడు అదిరే అభి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘వైట్‌ పేపర్‌’. శివ దర్శకుడు. జి.ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌ పతాకంపై గ్రంథి శివ కుమార్నిర్మిస్తున్నారు.

Published : 25 Sep 2021 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు ‘అదిరే’ అభి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘వైట్‌ పేపర్‌’. శివ దర్శకుడు. జి.ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌ పతాకంపై గ్రంథి శివ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు అభి పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌ని ప్రముఖ గాయకుడు మనో, నటులు అనసూయ, ఇంద్రజ విడుదల చేసి, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అభి మాట్లాడుతూ ‘దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయాలనే ఆసక్తి మొదలైంది. 9 గంటల 51 నిమిషాల్లోనే సినిమా షూటింగ్ పూర్తిచేయాలన్న ఆయన డెడికేషన్‌ నచ్చింది. అనుకున్నట్టుగానే నిర్ణీత సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. అలా విడుదలకి ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ఈ అవార్డు రావటం, మనో, ఇంద్రజ, అనసూయ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘సస్పెన్స్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. అభి నటించకపోతే ఈ సినిమా ఉండేది కాదు. అవార్డూ వచ్చేది కాదేమో! సినిమాని ఒక్క రోజులో ఎలా తీయగలవు? అని చాలామంది అన్నారు. అభి ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది’ అని అన్నారు దర్శకుడు శివ. వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నంద కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఛాయాగ్రహణం: మురళీ కృష్ణ, కూర్పు: కేసీబీ హరి, సంగీతం: నవనీత్ చారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని