Pawankalyan: పవన్‌ కోసం మరో రీమేక్‌?

పవన్‌ కల్యాణ్‌ వరుస సినిమాలతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘భీమ్లా నాయక్‌’, ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటి తర్వాత ఆయన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్‌

Updated : 23 Dec 2021 07:17 IST

పవన్‌ కల్యాణ్‌ వరుస సినిమాలతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘భీమ్లా నాయక్‌’, ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటి తర్వాత ఆయన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ చేయాల్సి ఉంది. అలాగే సురేందర్‌ రెడ్డి  దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపారు. ఇప్పుడు పవన్‌ జాబితాలో మరో కొత్త సినిమా చేరినట్లు తెలిసింది. దర్శకుడు త్రివిక్రమ్‌ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన చిత్రం     ‘వినోదాయ సీతాం’. తమిళంలో విజయవంతమైన ఈ సినిమానే    తెలుగులో పవన్‌తో పునర్నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కథను తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తున్నారని, దీనికి సముద్రఖనినే దర్శకుడిగా వ్యవహరిస్తారని ప్రచారం వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని