Valimai: ‘వలిమై’ వాయిదా

సినిమాల వాయిదా పరంపర కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం, ఆయా రాష్ట్రాల్లో నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తుండడంతో అగ్ర తారల సినిమాల ప్రదర్శనకి అనువైన పరిస్థితులు కనిపించడం

Updated : 07 Jan 2022 07:15 IST

సినిమాల వాయిదా పరంపర కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం, ఆయా రాష్ట్రాల్లో నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తుండడంతో అగ్ర తారల సినిమాల ప్రదర్శనకి అనువైన పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో భారీ వ్యయంతో రూపొందిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. సంక్రాంతికి విడుదల ఖరారు చేసుకున్న అజిత్‌ ‘వలిమై’ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాత బోనీ కపూర్‌. తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. తదుపరి విడుదల తేదీ ఎప్పుడనేది చిత్రబృందం ప్రకటించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని