Updated : 09/12/2021 13:07 IST

Balakrishna: ఈ సినిమాతో చిత్రపరిశ్రమకు ధైర్యమొచ్చింది: బాలయ్య

అప్పన్న సన్నిధిలో ‘అఖండ’ టీమ్‌

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అఖండ’. డిసెంబర్‌ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ‘అఖండ’ సక్సెస్‌మీట్‌ జరగనుంది. గురువారం సాయంత్రం నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం చిత్రబృందం తాజాగా వైజాగ్‌కు చేరుకుంది. సక్సెస్‌ టూర్‌లో భాగంగా బాలయ్య, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్‌రెడ్డి మొదట సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘‘అఖండ చిత్రం అఖండమైన విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు సాయంత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదట అప్పన్న స్వామిని దర్శించుకున్నాం. స్వామివారి ఆశీస్సులు అందుకున్నాం. ఇది మా ఒక్కరి విజయం మాత్రమే కాదు  ఇండస్ట్రీ విజయం. ఈ సినిమాతో చిత్రపరిశ్రమకు ఓ ధైర్యం వచ్చింది’’ అని బాలకృష్ణ అన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని