Akhanda Trailer: బాలకృష్ణ నట గర్జన.. అంచనాలు పెంచేలా ‘అఖండ’ ట్రైలర్‌ 

‘అఖండ’ ట్రైలర్‌ వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక.

Updated : 14 Nov 2021 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సింహా’, ‘లెజెండ్‌’.. సూపర్‌ హిట్ చిత్రాలతో క్రేజీ కాంబినేషన్‌గా మారారు నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను. వీరి కలయిలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘అఖండ’. ఈ సినిమాపై అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ఆ ఆసక్తి మరింత పెరిగింది. పోస్టర్లు, టైటిల్‌ గీతం విశేషంగా ఆకట్టుకోవడంతో ట్రైలర్‌ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం ఆ కానుకను అందించింది. ‘అఖండ రోర్‌’ పేరుతో ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేసింది.

బాలకృష్ణ అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. బాలకృష్ణ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం బాలకృష్ణ నట గర్జనను చూసేయండి..

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని