
Akshya Kumar: ‘పృథ్వీరాజ్’ టీజర్‌తో...
బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ జోరు కొనసాగుతోంది. ఇటీవలే ‘సూర్యవంశీ’ హిట్ అందుకున్న అక్షయ్... మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘పృథ్వీరాజ్’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 21 విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. మానుషి చిల్లార్, సంజయ్‌దత్, సోనూ సూద్ నటిస్తున్న ఈ చిత్రాన్ని చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ‘దీని కోసం ప్రేక్షకుల కంటే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గతేడాది కరోనా-లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల విడుదల చేయలేక పోయాం. జనవరి 21న అద్భుతమైన సినిమాని అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నాం.’ అంటోంది చిత్రబృందం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.