Nootokka Jillala Andagadu: ‘అలసిన సంచారి’ ఫుల్‌ వీడియో చూశారా!

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహానీ శర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు.

Updated : 07 Dec 2022 22:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహానీ శర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌ సమర్పిస్తున్నారు. ‘అలసిన సంచారి’ అనే గీతాన్ని (ఫుల్ వీడియో) చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. శ్రీవిశ్వ రచించిన ఈ గీతాన్ని హేమచంద్ర ఆలపించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. కథానాయకుడు బాధ నుంచి తేరుకుని విజయంవైపు అడుగేసే సన్నివేశాలతో చిత్రీకరించిన ఈ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణగా అలరించనున్నారు శ్రీనివాస్‌. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని