Brahmanandam: బ్రహ్మానందంలో మరో కోణం.. ఎస్వీఆర్ వాయిస్ దించేశారు!
కోట్లాది తెలుగు ప్రేక్షకులు ‘ఆలీతో సరదాగా’లో హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం(Brahmanandam)రావాలని ఎంతగానో ఎదురు చూశారు.
హైదరాబాద్: కోట్లాది తెలుగు ప్రేక్షకులు ‘ఆలీతో సరదాగా’లో హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం(Brahmanandam) రావాలని ఎంతగానో ఎదురు చూశారు. వారి కోరిక ఫలించింది. నవంబరు 29వ తేదీన ప్రసారమైన షోకు ఆయన విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమ లోకాన్ని మర్చిపోయారు. కాగా, ఈ సరదా సందడి మరో వారం కూడా కొనసాగనుంది. అందుకు సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా అలనాటి నటుడు ఎస్వీ రంగారావు వాయిస్‌ను బ్రహ్మానందం(Brahmanandam) అద్భుతంగా ఇమిటేట్ చేశారు. ఇప్పటివరకూ బ్రహ్మానందంలో చూడని సరికొత్త కోణాన్ని చూపించారు. ‘ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూసి నవ్వుతుంది? మరి మిమ్మల్ని నవ్వించేది ఎవరు’ అని అడగ్గా, ‘‘మా మనవడు. ఏదైనా అంటే ‘తాత నీకు తెలియదు ఊరుకో..’’ అంటాడు. గౌతమ్ తన ప్రేమ విషయాన్ని చెప్పగానే వారం పదిరోజుల్లో పెళ్లి చేశారట! అని అనగా ‘మా అబ్బాయి ఏమీ మర్డర్ చేయలేదు కదా. అందుకే అడగ్గానే చేసేశా’ అని సమాధానం ఇచ్చారు. ఇక బ్రహ్మానందం పాపులర్ పదమైన జఫ్పాకు అంటే అర్థం ఏంటి? అన్న ప్రశ్నకు ‘‘ఒకసారి ఒక వ్యక్తిని చూస్తూ, ‘ఏంట్రా చూస్తే పెద్ద జఫ్పాగాడిలా ఉన్నావ్’ అన్నాను అంతే అప్పటి నుంచి అది పాపులర్ అయింది’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న కమెడియన్స్‌లో బ్రహ్మానందంకు ఎవరంటే ఇష్టం? ఇటీవల సినిమాల్లో బ్రహ్మానందం(Brahmanandam) జోరు తగ్గడానికి కారణం? ఇలాంటి ప్రశ్నలకు ఆయన ఏం చెప్పారో వచ్చే సోమవారం చూడాలి.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..