Updated : 03/12/2021 12:47 IST

Dhee 13 Promo: ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. అన్నొచ్చిండు..!

గ్రాండ్‌ఫినాలే లేటస్ట్‌ ప్రోమో.. ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గలే..!

హైదరాబాద్‌: ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా’ అని అంటున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఢీ -13’ షోలో సందడి చేశారు. కింగ్స్ వర్సెస్‌ క్వీన్స్‌ కాన్సెప్ట్‌తో కంటెస్టెంట్స్‌ మధ్య హోరాహోరీగా సాగుతోన్న తుదిపోరుని చూసి ఎంతగానో ఎంజాయ్‌ చేశారు. అనంతరం విజేతకు టైటిల్‌ అందించారు. దీనికి సంబంధించిన సరికొత్త ప్రోమోని ఢీ టీమ్‌ విడుదల చేసింది. బన్నీ గ్రాండ్‌ ఎంట్రీ, సుధీర్‌-ఆదిల వరుస పంచులు.. పూర్ణ-ప్రియమణిలపై అల్లు అర్జున్‌ చేసిన సరదా కామెంట్స్‌తో ప్రోమో అదరగొట్టేలా ఉంది.

ఇందులో భాగంగా ప్రియమణి.. ‘‘బన్నీతో స్క్రీన్‌ పంచుకోలేదనే బాధ నాకింకా అలాగే మిగిలిపోయింది’’ అని అనడంతో..  ‘‘వర్క్‌ చేయలేదని అస్సలు అనుకోవద్దు. ఇప్పటికీ ఇంకా ఛాన్స్‌ ఉంది. ఎప్పుడైనా వర్క్‌ చేయవచ్చు’’అని బన్నీ సమాధానమివ్వడంతో ఆమె మురిసిపోయింది. మరోవైపు తనని సర్‌ప్రైజ్‌ చేస్తూ కంటెస్టెంట్స్‌ అందరూ కలిసి చేసిన స్పెషల్‌ డ్యాన్స్‌ ఫెర్ఫార్మెన్స్‌కి బన్నీ ఫుల్‌ ఫిదా అయ్యారు. సుమారు పది సీజన్ల తర్వాత మళ్లీ ‘ఢీ’ సెట్‌లోకి అడుగుపెట్టడం.. గ్రాండ్‌ఫినాలేలో భాగం కావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం

జనరల్