Allu Arjun: వెండితెరపైకి అల్లు వారి వారసురాలు..!
అల్లు అర్జున్ గారాలపట్టీ అర్హ త్వరలోనే వెండితెరపై సందడి చేయనున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో అర్హ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా అల్లు అర్జున్ ప్రకటించారు....
హైదరాబాద్: అల్లు అర్జున్ గారాలపట్టీ అర్హ త్వరలోనే వెండితెరపై సందడి చేయనుంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో అర్హ ఓ పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని తాజాగా అల్లు అర్జున్ ప్రకటించారు. ‘‘అల్లు కుటుంబంలోని నాలుగో జనరేషన్‌కు చెందిన అర్హ వెండితెరకు పరిచయమవుతోందని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’లో అర్హ సందడి చేయనున్నారు. నా కుమార్తెను ఇలాంటి అందమైన సినిమాతో వెండితెరకు పరిచయం చేస్తున్న గుణశేఖర్, నీలిమకు కృతజ్ఞతలు’’ అని బన్నీ ట్వీట్ చేశారు.
మహా భారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తున్నారు. మలయాళీ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో ప్రధానపాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా.. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే ఈ సినిమా షూట్ తిరిగి ప్రారంభమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!