Varudu Kaavalenu: నాగశౌర్యలో నాకు నచ్చిన విషయం అదే: అల్లు అర్జున్‌

‘నాగశౌర్య పెద్దస్టార్‌ అవ్వాలి అని కోరుకుంటున్నా’ అని అన్నారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌. ‘వరుడు కావలెను’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Updated : 30 Aug 2022 15:55 IST

హైదరాబాద్‌: ‘నాగశౌర్య పెద్దస్టార్‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌. ‘వరుడు కావలెను’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి బన్నీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రమిది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకని నిర్వహించింది.

వేడుకని ఉద్దేశించి అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘నాగశౌర్య అందగాడు. తనలోని అమాయకత్వం నాకు బాగా నచ్చుతుంది. ఆయన నటించిన అన్ని సినిమాలూ చూశా. తను పెద్ద స్టార్‌ అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటుంటా. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. దాన్ని నేను ఇష్టపడతా. ఈ సందర్భంగా ఆయన్ను అభినందిస్తున్నా. రీతూవర్మ చాలా పద్ధతిగా ఉంటుంది. తన తొలి చిత్రం నుంచే ఆమెని అభిమానిస్తున్నా. మహిళలు సినిమాకి దర్శకత్వం వహించడం చాలా గ్రేట్‌. లక్ష్మీ సౌజన్యగారిలా ఇంకొంతమంది దర్శకత్వంలోకి రావాలని కోరుకుంటున్నా. విశాల్‌ శేఖర్, తమన్‌ మంచి పాటలు అందించారు. ‘దిగు దిగు దిగు నాగ’ పాట మా ఇంటిలో నాన్‌స్టాప్‌గా ప్లే అవుతుంటుంది. సుమారు 60 ఏళ్ల సినిమా చరిత్రలో ఇలాంటి పరిస్థితి (కొవిడ్‌ కారణంగా విడుదలకాకపోవడం) ఎప్పుడూ ఎదురై ఉండదు. ఈ సీజన్‌ సినిమా పరిశ్రమకి చాలా విలువైంది. త్వరలో విడుదలకానున్న రజనీకాంత్‌గారి ‘పెద్దన్న’, ఆకాశ్‌ పూరి ‘రొమాంటిక్‌’ చిత్రాలూ మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నా. ఈ డిసెంబర్‌లో ‘పుష్ప’తో మీ ముందుకొస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌, నదియా, నాగశౌర్య, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని