Pushpa: తగ్గేదేలే.. రికార్డులు సృష్టిస్తోన్న ‘పుష్ప’!

సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం.. రికార్డులు సృష్టిస్తోంది. తొలి భాగం ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై అన్నిచోట్లా ఘన విజయం సాధించింది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించి రికార్డులు నమోదు చేసింది. తాజాగా

Published : 05 Jan 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం.. రికార్డులు సృష్టిస్తోంది. తొలి భాగం ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించి రికార్డులు నమోదు చేసింది. తాజాగా మరో రెండు రికార్డులు సృష్టించింది. 

‘పుష్ప’ చిత్రం కథ.. అల్లు అర్జున్‌ నటనే కాదు.. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లోనూ సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా యూట్యూబ్‌ ‘టాప్‌ 100 గ్లోబల్‌ సాంగ్స్‌’ జాబితాను విడుదల చేయగా.. అందులో ‘పుష్ప’లోని అన్ని పాటలు చోటు సంపాదించుకోవడం విశేషం. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!’ పాట టాప్‌ 100 జాబితాలో తొలిస్థానంలో నిలవగా.. ‘సామీ సామీ’ పాట రెండో స్థానం దక్కించుకుంది. ఇక ‘దాక్కో దాక్కో మేక’ 24వ స్థానంలో.. ‘శ్రీవల్లి’ 74వస్థానంలో.. ‘ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా’ 97వ స్థానంలో నిలిచాయి. 

మరోవైపు ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ పోర్టల్‌ ‘బుక్‌ మై షో’లో 50 లక్షల టికెట్లు కొనుగోలు చేశారట. 2021లో దేశవ్యాప్తంగా విడుదలైన చిత్రాల టికెట్ల గణాంకాల్లో ఇదే అత్యధికమని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందం కూడా సోషల్‌మీడియాలో పోస్టు పెట్టింది.

‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి ప్రేమకథల తర్వాత సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. బన్నీకి జోడిగా రష్మిక నటించింది. ప్రతినాయకులుగా సునీల్‌, ఫహద్‌ ఫాజిల్‌ ఆకట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా రెండో భాగం చిత్రీకరణ వచ్చే ఏడాదిలో ప్రారంభంకానుంది. 

Read latest Cinema News and Telugu News




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని