Published : 05 Jan 2022 17:06 IST

Amitabh Bachchan: ఈ షో కొనసాగుతుంది.. ప్రశాంతంగా ఉండండి: అమితాబ్‌

ముంబయి: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. పలువురు బాలీవుడ్‌ నటులు కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కి చెందిన మంబయి నివాసంలో సిబ్బంది ఒకరు కరోనా బారినపడినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమితాబ్‌ ప్రేరణనింపే సందేశాన్ని తన బ్లాగ్‌లో పోస్టు చేశారు.  

‘పోరాడు.. పోరాడండి.. మాట్లాడటానికేం లేదు.. ఈ షో కొనసాగుతుంది.. మనల్ని దయతో చూసే సర్వశక్తిమంతుడి చెంత ప్రశాంతంగా ఉండండి.. మనిషి అవమానకరంగా ప్రవర్తించినా.. మన్నించి, ధర్మమార్గంలో నడిచేలా దారిచూపుతాడు.. ఇంతవరకు గుర్తించని ఏదో తెలియని శక్తిని మనం అనుసరిస్తుంటాం.. ఆ శక్తి ఆవరించిన బుడగలో చివరి వరకు సురక్షితంగా ఉండండి’ అని కవితాత్మకంగా స్పందించారు. తాను కూడా కొవిడ్‌ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తర్వాత ముచ్చటిస్తానని ముగించారు.

2020లో అమితాబ్ కుటుంబం కరోనాతో ఇబ్బంది పడింది. ఆయనతో పాటు కొడుకు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలికి వైరస్ సోకింది. తాజాగా ఆయన జల్సా నివాసంలో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిలో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం కొవిడ్ కేర్‌ సెంటర్‌కు తరలించినట్లు బీఎంసీ తెలిపింది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని