Published : 26/11/2021 19:04 IST

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ను చూపించమన్న రవి కూతురు.. సిరితో షణ్ముఖ్‌ తల్లి ఏమన్నారంటే?

హైదరాబాద్‌: కంటెస్టెంట్స్‌ కుటుంబసభ్యుల రాకతో గత కొన్నిరోజులుగా బిగ్‌బాస్‌ హౌస్‌లో జోష్‌ నెలకొంది. ఇప్పటికే వచ్చిన కాజల్‌, మానస్‌, సన్నీ, శ్రీరామ్‌ కుటుంబ సభ్యులు సరదా పంచులతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేయగా, సిరి తల్లి.. షణ్ముఖ్‌పై వ్యాఖ్యలు చేసి కాస్త షాక్‌ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ప్రోమోలో రవి కుటుంబం బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చూపించారు.

మొదట హౌస్‌లోకి వెళ్లిన రవి సతీమణి ఆయన్ని హత్తుకోగానే.. ‘‘వియా రాలేదా.. నేను తనని బాగా మిస్‌ అవుతున్నాను’’ అని అసంతృప్తికి గురయ్యాడు. తాను ఎంతో ప్రయత్నించినప్పటికీ కుదరలేదని, అందువల్లే ఒక్కదాన్నే హౌస్‌లోకి వచ్చానని ఆమె చెప్పడంతో రవి ఏం మాట్లాడలేకపోయాడు. అనంతరం, ‘‘లవ్‌ యూ పప్పా’’ అంటూ వియా ఎంట్రీ ఇవ్వడంతో రవి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. కూతుర్ని దగ్గరకు తీసుకుని చిన్నపిల్లాడిలా మారి.. ఆటలు ఆడాడు. ఇక ‘‘వియా ఇంటిని వీడే సమయం ఆసన్నమైంది’’ అని బిగ్‌బాస్‌ చెప్పగానే.. ‘‘ఐ మిస్ యూ.. బాయ్‌ డాడీ’’ అంటూ ఆ చిన్నారి కన్నీరు పెట్టుకుంది.

Read latest Cinema News and Telugu News



Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని