Macherla Niyojakavargam: ‘మాచర్ల నియోజకవర్గం’లో మరో అందం

నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ డ్రామా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి దర్శకుడు.

Published : 16 Nov 2021 19:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ డ్రామా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో ఓ కథానాయికగా ఇప్పటికే కృతిశెట్టిని ఖరారు చేసిన చిత్ర బృందం తాజాగా మరో నాయిక వివరాల్ని ప్రకటించింది. నితిన్‌ సరసన కృతిశెట్టితోపాటు కేథరిన్‌ సందడి చేయనుందని తెలియజేసింది. ప్రాజెక్టులోకి ఆమెను ఆహ్వానిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు ‘సరైనోడు’, ‘గౌతమ్‌నంద’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ తదితర చిత్రాలతో అలరించింది. ‘మాచర్ల..’లో నితిన్‌ ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదలకానుంది. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని