Rajkundra Case: అనుమతిలేకుండా నా అశ్లీల చిత్రాలు రిలీజ్‌ చేశాడు

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాపై మరో నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలు హాట్‌షాట్స్‌ యాప్‌లో రాజ్‌కుంద్రా విడుదల చేశారని ఆమె పోలీసులకు....

Updated : 06 Aug 2021 11:04 IST

రాజ్‌కుంద్రాపై మరో నటి ఫిర్యాదు

ముంబయి: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాపై మరో నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలు హాట్‌షాట్స్‌ యాప్‌లో రాజ్‌కుంద్రా విడుదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ముంబయి పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసుకున్నారని పలు వార్తా కథనాలు బయటకు వచ్చాయి.

తాజాగా ఆ నటి రాజ్‌కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మల్వాణీ పోలీస్‌స్టేషన్‌లో కుంద్రాపై ఫిర్యాదు చేసిన నటి నుంచి తాజాగా ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు స్టేట్‌మెంట్‌ స్వీకరించినట్లు సమాచారం. రాజ్‌కుంద్రా మంచి వ్యక్తి కాదని.. తనకిచ్చిన మాట తప్పాడని ఆమె వెల్లడించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రైవేట్‌ పార్ట్స్‌ని వీడియోలో చూపించకూడదు అనే షరతుతో రాజ్‌కుంద్రా నిర్మించిన ఓ అశ్లీల చిత్రంలో తాను నటించానని.. అందుకుగాను కుంద్రా తనకి కొంత మొత్తాన్ని చెల్లించాడని ఆమె పోలీసుల ఎదుట తెలిపారట. అయితే, ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. ఏవిధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోని హాట్‌షాట్స్‌లో విడుదల చేశారని.. ఓ స్నేహితుడి ద్వారా ఆ విషయం తనకు తెలిసిందని ఆమె వివరించింది.

అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో రాజ్‌కుంద్రాను జులై 19న ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా, ఆయనకు చెందిన సంస్థల వల్ల ఇబ్బందిపడిన పలువురు బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని