Anubhavinchu Raja: బంగారంగాడి మనసులో ఏదీ పర్మినెంట్‌ కాదు: రాజ్‌ తరుణ్‌

కెరీర్‌లో మాంచి విజయాన్ని అందుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు నటుడు రాజ్‌ తరుణ్‌. ‘ఓరేయ్‌ బుజ్జిగా’, ‘పవర్‌ ప్లే’ చిత్రాలతో మిశ్రమ స్పందనలు అందుకున్న ఆయన...

Updated : 30 Jul 2022 14:42 IST

ఆకట్టుకునేలా ‘అనుభవించు రాజా’ ట్రైలర్‌

హైదరాబాద్‌: కెరీర్‌లో విజయాన్ని అందుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు నటుడు రాజ్‌ తరుణ్‌. ‘ఓరేయ్‌ బుజ్జిగా’, ‘పవర్‌ ప్లే’ చిత్రాలతో మిశ్రమ స్పందనలు అందుకున్న ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఇందులో రాజ్‌తరుణ్‌ పూర్వీకుల ఆస్తులను దుబారాగా ఖర్చు పెట్టే యువకుడిగా కనిపించనున్నారు.

‘‘రూపాయి పాపాయిలాంటిదిరా. దాన్ని పెంచి పెద్దచేసుకోవాలి కానీ.. ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు’’ అనే మాటలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. ‘‘బంగారంగాడి మనసు సినిమా హాలు లాంటిది. వారానికి ఒక సినిమా వస్తుంటుంది. పోతుంటుంది. ఏదీ పర్మినెంట్‌గా ఆడదు ఇక్కడ’’ అంటూ రాజ్‌ తరుణ్‌.. అరియానాతో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఇందులో రాజ్‌ తరుణ్‌కు జోడీగా కాషిశ్‌ ఖాన్‌ సందడి చేయనున్నారు. గోపీ సుందర్‌ స్వరాలు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని