Anupama Parameswaran: వాటితోనే జీవితం పరిచయం

సినిమా కోసం భావోద్వేగాలు పండించేటప్పుడు ఆయా కథలే ప్రభావితం చేస్తుంటాయి తప్ప... నా వ్యక్తిగత జీవితాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకోనని చెబుతోంది అనుపమ పరమేశ్వన్‌. తొలి అడుగుల్లోనే తెలుగింటి అమ్మాయిలా

Updated : 05 Jan 2022 07:12 IST

సినిమా కోసం భావోద్వేగాలు పండించేటప్పుడు ఆయా కథలే ప్రభావితం చేస్తుంటాయి తప్ప... నా వ్యక్తిగత జీవితాన్ని అస్సలు గుర్తుకు తెచ్చుకోనని చెబుతోంది అనుపమ పరమేశ్వన్‌. తొలి అడుగుల్లోనే తెలుగింటి అమ్మాయిలా మారిపోయిన అనుపమ వరుస సినిమాలతో సందడి చేస్తుంటుంది. ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘రౌడీబాయ్స్‌’, ‘కార్తికేయ2’, ‘18 పేజీస్‌’ చిత్రాల్లో అనుపమ నటించింది. వృత్తి, వ్యక్తిగత జీవితం... ఈ రెండూ ఒకదానిపై మరొకటి ఏమేరకు ప్రభావం చూపిస్తుంటాయన్న ప్రశ్నకి ఆమె బదులిస్తూ... ‘‘నటుల జీవితాలపై తప్పకుండా వృత్తి ప్రభావం ఎంతోకొంత ఉంటుంది. కొన్ని పాత్రలు చేసి బయటికొచ్చాక అవి మనసుల్ని వెంటాడుతుంటాయి. అయితే చాలావరకు రెండు జీవితాల్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకుంటుంటా. కెమెరా ముందుకు వెళ్లానంటే ఆయా కథలు, పాత్రలే ప్రపంచంగా మారిపోతుంటా. ఆ పాత్ర సంఘర్షణ నుంచే భావోద్వేగాల్ని పండించేందుకు ప్రయత్నిస్తుంటా. అంతే కానీ.. నా వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుని నటించే ప్రయత్నం చేయను. నిజ జీవితంలో నేనూ ప్రేమలో పడ్డా, విడిపోయాను. అలాగని సెట్లో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు నా ప్రేమని గుర్తు చేసుకోను. అలా అలవాటుపడితే కష్టమని నా అభిప్రాయం. కథల్లోని ప్రతీ సంఘర్షణ నా జీవితంలో ఉండదు కదా. ఇప్పటివరకు ఆయా కథలు, పాత్రలే నాకు ఎక్కువ జీవితాన్ని పరిచయం చేశాయ’’ని చెప్పుకొచ్చింది అనుపమ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని