ARRahman: రెహమాన్‌ పాడిన కొత్త పాట విన్నారా!

తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఎ.ఆర్‌. రెహమాన్‌. అప్పుడప్పుడు స్వీయ సంగీత దర్శకత్వంలో తన స్వరం వినిపిస్తుంటారు. ఏ భాషలో పాడినా యావత్‌ సంగీత ప్రియుల్ని అలరిస్తుంటారు.

Published : 21 Jul 2021 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఎ.ఆర్‌. రెహమాన్‌. అప్పుడప్పుడు స్వీయ సంగీత దర్శకత్వంలో తన స్వరం వినిపిస్తుంటారు. ఏ భాష పాటైనా సరే యావత్‌ సంగీత ప్రియుల్ని అలరిస్తుంటారు. అది ఆయన గళానికి ఉన్న ప్రత్యేకత. ‘రిహాయి దే’ అంటూ మరోసారి శ్రోతల్ని ఆకట్టుకుంటున్నారు. కృతి సనన్‌, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మిమీ’ చిత్రంలోని పాట ఇది. అమితాబ్‌ భట్టాచార్య సాహిత్యం అందించారు. కథలో సందర్భానుసారం వచ్చే ఈ పాట ఆద్యంతం అలరిస్తుంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 30 నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాలో కృతిసనన్‌ సరోగేట్‌ తల్లిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు