Atithi Devo Bhava: ‘నా భయం నాతోనే ఉంటుంది’.. ఆసక్తిగా ‘అతిథి దేవోభవ’ టీజర్
‘అతిథి దేవోభవ’ టీజర్. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: ‘రాముడికి లక్ష్మణుడు వెంట ఉన్నట్టు నా భయం ఎప్పుడూ నాతోనే ఉంటుంది’ అని అంటున్నారు నటుడు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న ‘అతిథి దేవోభవ’ చిత్రంలోని సంభాషణ ఇది. తాజాగా టీజర్ విడుదలైంది. కొన్ని సరదా సన్నివేశాలు, ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టీజర్‌లో వినిపించిన డైలాగ్స్‌ని బట్టి ఈ సినిమాలో కథానాయకుడికి ఏదో లోపం ఉన్నట్టు అర్థమవుతుంది. ‘ఒకడు చెప్పాడని ఇంకొకడితో చేయించేవాడు కాదురా.. ఎవడిది వాడు సెట్ చేసుకున్నోడే దమ్మునోడు’ అనే పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో ఆది సరసన నువేక్ష సందడి చేయనుంది. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సినీ క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రాజాబాబు, అశోక్‌రెడ్డి నిర్మిస్తున్నారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సీతాకోకచిలుకలా కృతిసనన్.. కోమలి ‘నిప్పు, నీరు’ క్యాప్షన్!
-
General News
Telangana news: ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు.. 6న బడ్జెట్
-
India News
70ఏళ్లలో తొలిసారి.. ఆ గుడిలో అడుగుపెట్టిన దళితులు
-
India News
Asaram Bapu: మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ
-
Movies News
Suhas: హీరోగా ఫస్ట్ థియేటర్ రిలీజ్.. సినిమా కష్టాలు గుర్తు చేసుకుని నటుడు ఎమోషనల్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు