Atithi Devo Bhava: ‘ఒంటరిగా ఉండటమంటే చావటమే’.. ఆసక్తిగా ‘అతిథి దేవోభవ’ ట్రైలర్
‘ఒంటరిగా ఉండమంటే నాకు చావుతో సమానం’ అని అంటున్నారు నటుడు ఆది సాయికుమార్.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఒంటరిగా ఉండమంటే నాకు చావుతో సమానం’ అని అంటున్నారు నటుడు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటించిన ‘అతిథి దేవోభవ’ చిత్రంలోని ఆసక్తికర సంభాషణ ఇది. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా నటుడు నాని ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కామెడీ, పలు ట్విస్ట్‌లతో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. డైలాగ్స్‌ని బట్టి ఈ సినిమాలో ఆది ఒంటరిగా ఉండేందుకు భయపడే వ్యక్తిగా కనిపించనట్టు తెలుస్తోంది. ‘ఒంటరిగా ఉంటే జ్ఞానం పుడుతుందా..! మరి నాకేంటి భయం పుడుతోంది’ అనే సంభాషణ మెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో ఆది సరసన నువేక్ష సందడి చేయనుంది. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. శ్రీనివాసా సినీ క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రాజాబాబు, అశోక్‌రెడ్డి నిర్మించారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!