Atrangi Re: ఒకే ఫ్రేమ్‌లో అక్షయ్‌, ధనుష్‌.. అలరిస్తోన్న ‘అత్రాంగి రే’ ట్రైలర్‌

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్‌ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అత్రాంగి రే’. సారా అలీఖాన్‌ కథానాయిక.

Published : 24 Nov 2021 23:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్‌ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అత్రాంగి రే’. సారా అలీఖాన్‌ కథానాయిక. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ట్రైలర్‌ని విడుదల చేసింది. ధనుష్‌ కిడ్నాప్‌ అయిన సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్‌ సందడి చేశారు. ప్రేమికులైన ధనుష్‌, సారా అలీఖాన్‌ గొడవ పడుతూ అలరించారు. ధనుష్‌ను దూరంపెట్టిన సారా అలీఖాన్‌ అక్షయ్‌ కుమార్‌కు ఎందుకు దగ్గరైందన్నది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని ఆనంద్‌ ఎల్‌. రాయ్‌, భూషణ్‌ కుమార్‌, హిమాన్షు శర్మ, కృష్ణన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని