MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ని మీరు ఎందుకు సన్మానించారు?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌ పరస్పర ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్యానెల్‌ నుంచి పోటీ చేస్తున్న..

Updated : 07 Oct 2021 16:37 IST

సినీ పరిశ్రమలో నటుడు పృథ్వీరాజ్‌ ఆడియో కలకలం

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్‌ పరస్పర ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్యానల్‌ నుంచి పోటీ చేస్తున్న నటుడు పృథ్వీరాజ్‌కు సంబంధించిన ఓ ఫోన్‌ కాల్‌ ఆడియో ఇప్పుడు పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని.. కాకపోతే పరిపాలించే అర్హత మాత్రం ఉండదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారాయి. ప్రకాశ్‌రాజ్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు పరిశ్రమలోనే కాకరేపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి పృథ్వీరాజ్‌ ఫోన్‌ కాల్‌ చేసి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ‘‘నాకు వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. నా రాజకీయ ప్రస్థానం మొదలైంది వైజాగ్‌ నుంచే. అయితే, మీరు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ని సన్మానించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆయనకు మీరు ఎలా మద్దతు ఇస్తారు? ప్రకాశ్‌రాజ్‌ క్రమశిక్షణ బాలేదని ఫిల్మ్‌ ఛాంబర్‌ అసోసియేషన్‌ ఆయన్ని రెండుసార్లు సస్పెండ్‌ చేసింది. నేను ఓ కన్నడ సినిమా షూట్‌లో ఉన్నప్పుడు.. ‘కన్నడ వాళ్లు మాత్రమే ఇక్కడ నటించాలి’ అని నాపై ఆయన కేకలు వేశాడు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ మనల్ని మాత్రం పరిపాలించకూడదు. అలాంటిది మీకు ఆయన ఎందుకు అంత నచ్చాడు? పరాయిభాష వాళ్లపై మీకు అంత ఇష్టమేమిటి? ఏది ఏమైనా నా స్లోగన్‌ ఒక్కటే ‘తెలుగువాడిని గెలిపిద్దాం.. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం’’ అని పృథ్వీరాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని