Nithiin: ‘బేబీ ఓ బేబీ’.. ‘మ్యాస్ట్రో’ ప్రోమో చూశారా!

నితిన్ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘మ్యాస్ట్రో’. న‌భా న‌టేశ్ క‌థానాయిక‌. ఈ సినిమాలోని తొలిగీతానికి సంబంధించిన ప్రోమో వీడియోను గురువారం విడుదల చేసింది చిత్ర బృందం.

Published : 15 Jul 2021 21:29 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: నితిన్ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘మ్యాస్ట్రో’. న‌భా న‌టేశ్ క‌థానాయిక‌. ఈ సినిమాలోని తొలిగీతానికి సంబంధించిన ప్రోమో వీడియోను గురువారం విడుదల చేసింది చిత్ర బృందం. ‘బేబీ ఓ బేబీ’ అంటూ సాగే ఈ పాటని శ్రీజో రచించగా అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూర్చారు. ఫుల్‌ వీడియోను (లిరికల్‌) జులై 16 విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. హిందీలో విజయం అందుకున్న ‘అందాధున్’ రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఛాయాగ్ర‌హ‌ణం: జె.యువ‌రాజ్‌, కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్‌, క‌ళ‌: సాహి సురేశ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని