Backdoor: ‘బ్యాక్‌డోర్‌’లో ఏం జరిగింది?

పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాత. తేజ త్రిపురాన కథానాయకుడు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో

Updated : 24 Dec 2021 08:59 IST

పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాత. తేజ త్రిపురాన కథానాయకుడు. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటి జీవితా రాజశేఖర్‌, అడిషనల్‌ ఎస్పీ కె.జి.వి.సరిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటి పూర్ణ మాట్లాడుతూ ‘‘కొత్తదనం నిండిన ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. నాకిలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడు బాలాజీకి కృతజ్ఞతలు’’ అంది. ‘‘సినిమా బాగా వచ్చింది. పూర్ణ కెరీర్‌లో ఈ ‘బ్యాక్‌డోర్‌’ ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, టి.రామసత్యనారాయణ, డి.ఎస్‌.రావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని