Good Luck Sakhi: గుడ్‌ లక్‌ సఖి నుంచి బ్యాడ్‌ లక్‌ సఖి వచ్చేసింది..!

నటి కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్...

Updated : 07 Dec 2022 18:51 IST

హైదరాబాద్‌: నటి కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘బ్యాడ్‌ లక్‌ సఖి’ ఫుల్‌ వీడియో పాటను నటుడు రానా విడుదల చేసి చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలిపారు. సినిమాలో కీర్తి సురేశ్‌ పాత్ర గురించి తెలియజేసేలా ఈ పాటను తెరకెక్కించారు. ఆమెను ఓ దురదృష్టవంతురాలిగా చూపించారు. 

‘అదిగో వస్తుంది బ్యాడ్‌ లక్‌ సఖి’ అంటూ సాగే ఈపాటను హరిప్రియ, సమీరా భరద్వాజ్‌, ఎంఎల్‌ఆర్‌ కార్తికేయన్‌ ఆలపించారు. దిల్‌రాజు సమర్పణలో వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 26న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని