Akhanda: ‘అఖండ’.. విదేశాల్లో వసూళ్ల సునామీ..!

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత అత్యధిక మంది ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చిన చిత్రంగా నిలిచింది ‘అఖండ’.

Updated : 05 Dec 2021 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత అత్యధిక మంది ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చిన చిత్రంగా నిలిచింది ‘అఖండ’. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ ఇదే హవా కొనసాగిస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమిది. ప్రజ్ఞా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 2న విడుదలైంది. తొలి రోజు.. తొలి ఆట నుంచే ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. అత్యధిక వసూళ్లు రాబడుతూ రికార్డు సృష్టిస్తోంది. కొవిడ్‌ సెకండ్‌ తర్వాత ఓవర్సీస్‌లో (విడుదలైన తొలిరోజు) అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియన్‌ కరెన్సీ ప్రకారం.. ఈ సినిమా కెనడాలో (ప్రీమియర్‌తో కలిపి) సుమారు రూ. 13లక్షలు, యుకేలో సుమారు రూ. 32 లక్షలు, ఆస్ట్రేలియాలో సుమారు రూ. 52 లక్షలు రాబట్టిందని పేర్కొన్నారు. అమెరికాలో (మూడు రోజులు కలిపి) సుమారు రూ.5 కోట్లు కలెక్ట్‌ చేసిందని ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని