Unstoppable: మోహన్‌బాబుతో బాలకృష్ణ.. షో ముందు జరిగింది ఇదే!

బాలకృష్ణ వ్యాఖ్యాతగా అలరిస్తోన్న రియాల్టీ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తనదైన

Updated : 16 Nov 2021 13:08 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ వ్యాఖ్యాతగా అలరిస్తోన్న రియాల్టీ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తనదైన వాక్పటిమ, పంచ్‌డైలాగ్‌లతో బాలకృష్ణ ఈ షోను రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. తొలి ఎపిసోడ్‌లో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు సందడి చేయగా, రెండో ఎపిసోడ్‌లో నాని నవ్వులు పంచారు. తాజాగా తొలి ఎపిసోడ్‌ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను ‘ఆహా’ విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ ఎంట్రీ సాంగ్‌కు నటరాజ్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూరుస్తూ కనిపించారు. ఇక విరామ సమయంలో అల్లు అరవింద్‌తో బాలకృష్ణ ముచ్చట్లు చెబుతూ కనిపించారు. మోహన్‌బాబు షోకు రాగానే రెండు చేతులూ జోడించి నమస్కరించారు. ఇక వేదికపై బాలకృష్ణ, మోహన్‌బాబుల మాటల సందడి ఎలా సాగిందో మీరే చూసి ఉంటారు. మరి తెరవెనుక జరిగిన ఆ ముచ్చట్లను చూసేయండి.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు