
Published : 28 Oct 2021 01:24 IST
Unstoppable: ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో.. అదరగొట్టిన బాలయ్య
ఇంటర్నెట్ డెస్క్: పాత్ర ఏదైనా, నేపథ్యం ఎలాంటిదైనా వెండితెరపై తన నటన, వాక్ చాతుర్యంతో కట్టిపడేసే నటుడు బాలకృష్ణ (Balakrishna). పలు వేడుకల్లో తనలోని గాయకుడ్ని పరిచయం చేసిన బాలకృష్ణ... ఇప్పుడు వ్యాఖ్యాతగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable) అనే కార్యక్రమంతో సందడి చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ (Aha)లో ప్రసారంకానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. హోస్ట్‌గా బాలకృష్ణ విశేషంగా అలరించారు. ‘సరదాలో స్టాప్ ఉండదు’, ‘సై అంటే సై.. నై అంటే నై’ అనే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఆయన లుక్స్, స్టైల్ అభిమానుల్ని ఫిదా చేసేలా ఉన్నాయి. నవంబరు 4 (Unstoppable from Nov 4th) నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. సినీ ప్రముఖుల జీవితాన్ని ఈ షోలో ఆవిష్కరించనున్నారు.
ఇవీ చదవండి
Tags :