Bangarraju: నాగార్జున- చైతన్య.. సోగ్గాళ్ల సందడి షురూ

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకుడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలు. బుధవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభినట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది.  

Published : 25 Aug 2021 23:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకుడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలు. బుధవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభినట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. ‘సోగ్గాళ్ల షూటింగ్‌ బిగిన్స్‌’ అంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో రెండు బుల్లెట్‌లు దర్శనమిచ్చాయి. పంటపొలాలు, తోరణాలతో రూపొందించిన ఈ పోస్టర్‌ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. 2016 సంక్రాంతికి విడుదలై, ఘన విజయం అందుకున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతోంది. జీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలోనూ నాగార్జున నటిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన ‘లవ్‌స్టోరి’ సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని