Bangarraju: ‘బంగార్రాజు’ విడుదల ఖరారు.. ఏ రోజంటే?

అక్కినేని నాగార్జు, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ విడుదల తేదీ ఖరారైంది.

Updated : 07 Dec 2022 14:20 IST

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జు, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జనవరి 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సినిమాను సంక్రాంతికే తీసుకొస్తామని చిత్ర బృందం ఎప్పటి నుంచో చెప్తున్నా విడుదల తేదీని ఖరారు చేయకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించి విడుదల తేదీని ప్రకటించింది. ‘బంగారా’ అనే గీతానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.

గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్‌ కావటంతో ‘బంగార్రాజు’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు, ఇదే రోజున విడుదలకానున్న ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని