Bangarraju: లుక్కు.. టీజర్‌ కిక్కు

సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా ‘బంగార్రాజు’ను శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు కథానాయకుడు నాగార్జున. ఇప్పటికే పండగ బెర్తులన్నీ ఖరారైన నేపథ్యంలో ఈ సినిమాకి చోటుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Updated : 21 Nov 2021 07:20 IST

సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా ‘బంగార్రాజు’ను శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు కథానాయకుడు నాగార్జున. ఇప్పటికే పండగ బెర్తులన్నీ ఖరారైన నేపథ్యంలో ఈ సినిమాకి చోటుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఏది ఎలాగున్నా.. ప్రస్తుతానికైతే పండగ లక్ష్యంగానే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తున్నారు నాగ్‌. ఈనెల 22న సాయంత్రం 5:22 గంటలకు బంగార్రాజు లుక్‌ను, 23న ఉదయం 10:23 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రీలుక్‌ను పంచుకున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. జీ  స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగచైతన్య మరో హీరో. ఇందులో నాగ్‌ సరసన  రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూకి జోడీగా నాగలక్ష్మి అనే పాత్రలో కృతి శెట్టి కనిపించనుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తుండగా.. యువరాజ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని