Bheemla Nayak: భీమ్లానాయక్‌ షూట్‌.. పవన్‌ను చూసేందుకు ఎగబడిన జనం

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా సరికొత్త షెడ్యూల్‌ శుక్రవారం ఉదయం వికారాబాద్‌లోని....

Updated : 17 Dec 2021 11:22 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ శుక్రవారం ఉదయం వికారాబాద్‌లోని మదన్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమైంది. ఇక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తాజాగా పవన్‌కల్యాణ్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు పవన్‌ను చూసేందుకు భారీగా లొకేషన్‌ వద్దకు చేరుకున్నారు. ‘‘పవన్‌కల్యాణ్‌.. పవన్‌కల్యాణ్‌’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన కారు నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో చిత్రీకరణ జరిగే ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాలో పవన్‌కల్యాణ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ రోల్‌లో కనిపించనున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌, రానాకు జంటగా సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Cinema News and Telugu News




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని