BheemlaNayak: మాస్‌ జాతర షురూ.. మూడో సాంగ్‌ అదిరింది

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Powerstar Pawankalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak). మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న...

Published : 07 Nov 2021 11:45 IST

సౌండ్‌ ఆఫ్‌ భీమ్లానాయక్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Powerstar Pawankalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమ్లానాయక్‌’ (Bheemla Nayak). మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ (Ayyappanum Koshiyum) రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ బయటకు వచ్చింది. ‘సౌండ్‌ ఆఫ్‌ భీమ్లానాయక్‌’ (Sound Of Bheemla Nayak) పేరుతో మూడో పాటను విడుదల చేశారు.

‘లాలా భీమ్లా.. అడవి పులి.. గొడవపడి’ అంటూ సాగే పాట సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను తెలియజేసేలా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) ఈ పాటను రచించారు. సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు అందించగా అరుణ్ కౌండిన్య పాటను మరింత పవర్‌ఫుల్‌గా ఆలపించారు. విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ పాట ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు ఈ సినిమాలో నటుడు రానా (Rana) కీలకపాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన డేనియల్‌ శేఖర్‌గా కనిపించనున్నారు. రానాకు జోడీగా సంయుక్త మేనన్‌.. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ సందడి చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని