BiggBoss Telugu5: మాట జారిన షణ్ముఖ్‌.. శ్వేత క్షమిస్తుందా?

బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’. నాగార్జున వ్యాఖ్యాతగా 5వ సీజన్‌ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

Updated : 22 Sep 2021 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’. నాగార్జున వ్యాఖ్యాతగా 5వ సీజన్‌ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. హౌస్‌మేట్స్‌ అంతా తమదైన శైలిలో వినోదం పంచుతున్నారు. ఈ క్రమంలో వారు అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంటుంది. షణ్ముఖ్‌కి ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ రోజు ప్రసారంకానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఈ విషయాన్ని తెలియజేసింది. ఏమైందంటే.. శ్వేత, షణ్ముఖ్‌ ఓ డీల్ (ఒప్పందం) గురించి మాట్లాడుకుంటారు. లోబోని పక్కకి తప్పించి వీరిద్దరే డబ్బులు తీసుకోవాలనుకుంటారు. అలా.. ‘పెళ్లి చేసుకుందాం! శ్వేత’ అంటూ శ్వేతకి షణ్ముఖ్‌ దగ్గరవుతాడు. కట్‌ చేస్తే ‘ఐ లవ్‌ యు శ్వేత.. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వంటే నాకు ఊపిరి’ అని లోబో చెప్పగానే శ్వేత నవ్వుతూ థ్యాంక్స్‌ అంటుంది. ఈ సీన్‌ చూసిన షణ్ముఖ్‌కి కోపం వస్తుంది. ‘ఏమైనా అందామంటే ముఖం మీద పెయింట్‌ వేసి కొడుతుంది’ అంటూ తన ఫ్రస్టేషన్‌ చూపిస్తాడు. ఈ మాటకి శ్వేత ఫీలవుతుంది. ‘నోటి దురద’ అనుకుంటూ శ్వేతని క్షమించమని షణ్ముఖ్‌ బ్రతిమిలాడతాడు. మరి శ్వేత అతణ్ని క్షమించిందా, లేదా? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

ఆ బ్యాడ్‌ న్యూస్‌ ఏంటి?

తీవ్ర వాదోపదాలతో హీట్టెక్కిన హౌస్‌ని బిగ్‌బాస్‌ చల్లబరిచే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ‘హైదరాబాద్‌ అమ్మాయి- అమెరికా అబ్బాయి’ పేరుతో కొత్త కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు.  హైదరాబాద్‌ అమ్మాయిగా లహరి.. అమెరికా అబ్బాయిగా శ్రీరామచంద్ర సందడి చేయనున్నారు. ఇతర పాత్రల్ని మరికొందరు హౌస్‌మేట్స్‌ పోషించారు. ఈ పెళ్లి వేడుకతో అంతా ఆనందమే అనుకునేలోపు హౌస్‌లోని ఫోన్‌ ట్రింగ్‌ ట్రింగ్‌మని మోగుతుంది. ప్రియ లిఫ్ట్ చేయగానే ‘మనకో బ్యాడ్‌ న్యూస్‌’ అనే మాట వినిపిస్తుంది. మరి ఆ బ్యాడ్‌ న్యూస్‌ ఏంటి? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని