BiggBossTelugu5: షణ్ముఖ్‌ సమాధానంతో.. సిరి కంటతడి! అతడు ఏమన్నాడంటే?

‘బిగ్‌బాస్‌ తెలుగు 5’ ప్రోమో... స్విమ్‌ జర స్విమ్‌ టాస్క్‌తో సందడి చేయనున్న హౌస్‌మేట్స్‌....

Updated : 23 Sep 2021 18:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతిరోజూ అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్’. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా 5వ సీజన్‌ ప్రసారమవుతోంది. హౌస్‌మేట్స్‌లో జోష్‌ నింపేందుకు ‘బిగ్‌బాస్‌’ విభిన్న టాస్క్‌లు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేసిన ‘హైదరాబాద్‌ అమ్మాయి- అమెరికా అబ్బాయి’ టాస్క్‌ విశేషంగా అలరించింది. ఈ రోజు ‘స్విమ్‌ జర స్విమ్’ అనే కెప్టెన్సీ టాస్క్‌తో వినోదం పంచేందుకు హౌస్‌మేట్స్‌ సిద్ధమ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఓ స్విమ్మింగ్‌పూల్‌లో ఇంగ్లిష్‌ అక్షరాలుంటాయి. ఈదుకుంటూ వెళ్లి వాటిని తీసుకొచ్చి నిర్ణీత సమయంలో ‘CAPTAINCY’ అని పేర్చాలి. మరోవైపు, షణ్ముఖ్‌తో స్నేహం చేయాలని సిరి భావిస్తుంది. ‘నువ్వు నాతో మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడకపోతే బాధగా ఉంటుంది. కనీసం నువ్వు తిట్టినా ఆనందమే’ అని షణ్ముఖ్‌తో తమ మనసులో మాట చెప్తుంది. ‘నీతో ఫ్రెండ్‌షిప్‌ చేయడం నాకు ఇష్టం లేదు’ అని షణ్ముఖ్‌ ఇచ్చిన సమాధానంతో సిరి కంటతడి పెట్టుకుంటుంది. మరి ఈ టాస్క్‌లో గెలిచిందెవరు? షణ్ముఖ్‌, సిరి మధ్య స్నేహం ఏర్పడుతుందా? తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని