Published : 02 Dec 2021 08:42 IST

Bigg Boss Telugu 5: ప్రియాంక సలహాతో శ్రీరామ్‌కి తిప్పలు.. కన్నీరు పెట్టుకున్న సన్నీ

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘టికెట్‌ టు ఫినాలే’ రేస్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్‌ అందరూ ఏకాభిప్రాయంతో ఎండ్యూరెన్స్‌ను ఎంచుకున్నారు. ఐస్‌ టబ్‌లో కాళ్లు పెట్టుకుని ఉండాలని, కాళ్లు బయట పెట్టినప్పుడు ఇతర ఇంటిసభ్యులు అతని దగ్గర ఉన్న బాల్స్‌లో ఒకదాన్ని తీసుకుని తమ టబ్‌లో వేసుకోవాలని బిగ్‌బాస్‌ సూచించాడు. మొదట సరదాగా సాగిన ఈ టాస్క్ ఆ తర్వాత ఎంతో సీరియస్‌గా మారింది. సన్నీ-షణ్ముఖ్‌ స్థానాలను బిగ్‌బాస్‌ మార్చడంతో అసలాట మొదలైంది. సన్నీ టబ్‌లోని బాల్స్‌ తీసేందుకు సిరి ప్రయత్నించే క్రమంలో అతని టబ్‌ మొత్తంగా కిందపడిపోయింది. దీంతో సన్నీ.. ఆగ్రహానికిలోనయ్యాడు. ‘నిజాయతీగా ఆడదామనుకున్నా. కానీ, అనవసరంగా నన్ను ఇబ్బందిపెడుతున్నారు’ అని అసహనం వ్యక్తం చేశాడు. ‘గేమ్‌లో ఎవర్నీ కదపకుండా ఎలా ఉంటాం’ అని సిరి కౌంటర్‌ ఇచ్చింది.

అనంతరం కిందపడిపోయిన తన బాల్స్‌ అన్నింటినీ సన్నీ తన టబ్‌లో వేసుకున్నాడు. సిరి దగ్గర ఉన్న బాల్స్‌ని తీసుకునేందుకు సన్నీ ప్రయత్నించి.. ఆమె పక్కనే  ఎక్కువ సమయం పాటు నిల్చున్నాడు. ఐస్‌ టబ్‌లో ఉండలేక, బయటకు రాలేక సిరి ఇబ్బంది పడింది. సిరి ఇబ్బందిని గుర్తించిన శ్రీరామ్‌.. ‘‘నేను ఐస్‌ టబ్‌లో నుంచి కాళ్లు బయట పెడుతున్నా. కావాలంటే నా బాల్స్‌ తీసుకో’’ అని సన్నీని కోరాడు. ‘‘నాకు అవసరమైనప్పుడు తీసుకుంటా. ఉచిత సలహాలివ్వొద్దు’’ అని శ్రీరామ్‌కు సూచించాడు. ఇక, సన్నీ అటు ఇటు తిరుగుతూ ఇతర హౌస్‌మేట్స్‌ వద్ద నుంచి బాల్స్‌ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నా సిరి మాత్రం ఐస్‌ టబ్‌లో నుంచి కాళ్లు బయట పెట్టకుండా.. ‘‘నేను గివ్‌ అప్‌ ఇవ్వను. రవీ.. నీకోసం ఆడుతున్నా’’ అంటూ అరవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే మళ్లీ సన్నీ బాల్స్‌ తీసేందుకు సిరి ప్రయత్నించగా.. సిరి టబ్‌లో ఉన్న బాల్స్‌ను సన్నీ తీసేందుకు ఆమె వైపు వేగంగా వెళ్లాడు. దీంతో సిరి టబ్‌లో ఉన్న బాల్స్‌ అన్నీ కిందపడిపోయాయి. ‘‘గేమ్‌ని గేమ్‌లా ఆడకుండా కేవలం నన్ను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నావు’’ అంటూ సిరి వాదన మొదలుపెట్టింది. దీంతో సన్నీ.. ఆమె బాల్స్‌ అన్నింటినీ టబ్‌లోకి ఎత్తి ఆమెకు ఇచ్చాడు.

బజర్‌ మోగే సమయానికి సిరి కాళ్లు కదపలేని స్థితికి వచ్చింది. ఐస్‌ కారణంగా గాయాలపాలైన వారికి వైద్యులు చికిత్స చేశారు. ఈ క్రమంలో సిరిని ఎత్తుకుని మానస్‌ బెడ్‌రూమ్‌కి తీసుకువచ్చాడు. దీంతో షణ్ముఖ్‌.. సిరిపై అసహనం వ్యక్తం చేశాడు. వాళ్ల సాయం తీసుకోవడం ఏమిటని మండిపడ్డాడు. ‘‘నువ్వు నా ఫ్రెండ్‌ అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. మనిషికి ఆత్మగౌరవం ఉండాలి. నువ్వు మరీ ఇంత వీక్‌ అనుకోలేదు. అస్సలు నువ్వు నా ఫ్రెండ్‌గా ఉండొద్దు’’ అని ఆమెపై చిందులు తొక్కాడు. ఇక, కాజల్ - సన్నీ మాట్లాడుకుంటూ కావాలనే తనని బ్యాడ్‌గా ప్రూవ్‌ చేయడానికి సిరి ప్రయత్నిస్తోందని వాపోయాడు. మధ్య మధ్యలో ఐస్‌ బకెట్‌ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నా.. సిరి పంతానికి పోయి గాయాలపాలైందని సన్నీ అన్నాడు.

ఐస్‌ కారణంగా శ్రీరామ్‌ కాలికి కూడా గాయాలయ్యాయి. అతడి కాలికి మందు రాసి.. ప్రియాంక మసాజ్‌ చేసింది. కాళ్లు వేడి నీళ్లల్లో పెట్టొద్దని బిగ్‌బాస్‌ వైద్యులు చెప్పినా.. గోరువెచ్చని నీళ్లలో పెట్టొచ్చంటూ ఆమె సలహా ఇచ్చింది. దీంతో శ్రీరామ్‌ కాళ్లు వాచిపోయాయి. మళ్లీ వైద్యుల వద్దకు వెళ్లగా శ్రీరామ్‌ కాళ్లకు కట్టు కట్టి మందులిచ్చారు. నడవలేక ఇబ్బందిపడుతున్న శ్రీరామ్‌ను సన్నీ తన వీపుపై ఎక్కించుకుని మోసుకుంటూ బెడ్‌రూమ్‌కి తీసుకువచ్చాడు. మరోవైపు, హౌస్‌మేట్స్‌ గాయాలపాలవడంతో సన్నీ బాధపడ్డాడు. తాను కేవలం గేమ్‌ మాత్రమే ఆడానని.. ఎవర్నీ గాయపర్చాలనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. మానస్‌ అతడ్ని ఓదార్చాడు. అనంతరం హౌస్‌మేట్స్‌కు కావాల్సిన ఆహారాన్ని సన్నీనే సిద్ధం చేశాడు. గార్డెన్‌ ఏరియాలో కూర్చొన్న కాజల్‌-మానస్‌ మాట్లాడుకుంటూ సిరి-షణ్ముఖ్‌లే రవిని నామినేట్‌ చేసి బయటకు పంపి.. ఇప్పుడు రవి కోసమే ఆడుతున్నామనడం విచిత్రంగా ఉందని మాట్లాడుకున్నారు. హౌస్‌లో ఉన్నప్పుడు సపోర్ట్‌ చేయకుండా బయటకు వెళ్లిన తర్వాత ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో అని చర్చించుకున్నారు. ఐస్‌ టబ్‌ టాస్క్‌లో సన్నీ మొదటిస్థానంలో ఉండగా శ్రీరామ్‌ రెండో స్థానంలో ఉన్నాడని బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

రెండో టాస్క్‌.. ‘ఫోకస్‌’

టికెట్‌ టు ఫినాలే రేస్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌ రెండో టాస్క్‌గా ఫోకస్‌ని ఎంచుకున్నారు. బిగ్‌బాస్‌ పిలిచినప్పుడు హౌస్‌లోని ఇద్దరు వ్యక్తులు టాస్క్‌ ఏరియాలో ఉంచిన కుర్చీలో కూర్చొని 29 నిమిషాలను లెక్కించాలి. ఇచ్చిన సమయానికి ఎవరైతే దగ్గరగా లెక్కిస్తారో వాళ్లే విజేతలు అవుతారు. 29 నిమిషాలు అయిపోయిందని చెబుతూ తమ ఎదురుగా ఉన్న బెల్‌ కొట్టాల్సి ఉంటుంది. మిగిలిన హౌస్‌మేట్స్ వాళ్ల ఏకాగ్రతకు ఎలాగైనా భంగం కలిగించవచ్చు. సన్నీ వేసిన పంచులతో ఈ టాస్క్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని