bigg boss telugu 5: ఇంటిని వీడుతున్న జెస్సీ.. కన్నీరు పెట్టుకున్న సిరి, షణ్ముఖ్‌ 

హోరాహోరీగా తలపడుతున్న ఇంటిసభ్యులకు ‘బిగ్‌బాస్‌’ (Bigg Boss) ఊహించని షాక్‌ ఇచ్చాడు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న జెస్సీని (Jessie) ఇంటికి పంపిస్తున్నట్లు...

Published : 09 Nov 2021 14:04 IST

ఒంటరైన స్నేహితులు

హైదరాబాద్‌: హోరాహోరీగా తలపడుతున్న ఇంటిసభ్యులకు ‘బిగ్‌బాస్‌’ (Bigg Boss) ఊహించని షాక్‌ ఇచ్చాడు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న జెస్సీని (Jessie) ఇంటికి పంపిస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ‘బిగ్‌బాస్‌’ సూచనతో కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లిన జెస్సీ.. తన ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. ‘‘జస్వంత్‌ మీ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగు పడలేదనే విషయం మీక్కూడా తెలుసు. అందుకోసం మీరు ఇంటి నుంచి బయటకురావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మెయిన్‌ గేట్‌ నుంచి బయటకు రండి’’ అని బిగ్‌బాస్‌ సూచించాడు. అనంతరం కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన జెస్సీ.. ‘‘నేను బిగ్‌బాస్‌ హౌస్‌ వదిలివెళ్లిపోతున్నాను’’ అని ప్రకటించాడు. జెస్సీ మాట విని ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. తమకెంతో ఆప్తుడైన జెస్సీ హౌస్‌ని విడిచి వెళ్లడంపై షణ్ముఖ్‌, సిరి (Siri) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జెస్సీని హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. ‘‘ఐ మిస్‌ యూ రా’’ అంటూ జెస్సీ సైతం విచారం వ్యక్తం చేశాడు. అనంతరం జెస్సీ మెయిన్‌ గేట్‌ నుంచి బయటకు వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. నిజంగానే జెస్సీ హౌస్‌ని వదిలి బయటకు వస్తున్నాడా? అతను తిరిగి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని