Bigg Boss Telugu 5: రవికి సూపర్‌ పవర్‌.. సన్నీ అసహనం..!

బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా జరుగుతోన్న ‘నీ ఇల్లు బంగారం కాను’ టాస్క్‌ ఉత్కంఠగా కొనసాగుతోంది. టాస్క్‌లో భాగంగా పవర్‌ రూమ్‌లోకి వెళ్లే....

Published : 18 Nov 2021 14:34 IST

హైదరాబాద్: బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో భాగంగా జరుగుతోన్న ‘నీ ఇల్లు బంగారం కాను’ టాస్క్‌ ఉత్కంఠగా కొనసాగుతోంది. టాస్క్‌లో భాగంగా పవర్‌ రూమ్‌లోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకునేందుకు ఇంటి సభ్యులందరూ ఎదురుచూశారు. ఈ క్రమంలోనే పవర్‌రూమ్‌లోకి వెళ్లే అవకాశాన్ని సొంతం చేసుకుని స్పెషల్‌ పవర్‌ను రవి దక్కించుకున్నారు. ‘‘ఈ స్పెషల్‌ పవర్‌ని మీరు ఉపయోగించుకుంటారా? లేదా ఇంటి సభ్యుల్లో ఎవరికైనా ఇస్తారా?’’ అని రవిని బిగ్‌బాస్‌ ప్రశ్నించగా.. సన్నీకి తాను ఈ స్పెషల్‌ పవర్‌ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.

పవర్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం తన వద్ద ఉన్న స్పెషల్‌ పవర్‌ని సన్నీకి ఇస్తున్నట్లు రవి చెప్పగానే.. ఇంటి సభ్యులందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇక, సన్నీ అయితే అసహనానికిలోనయ్యాడు. ‘‘నాకు ఏ స్పెషల్‌ పవర్‌ వద్దు. నేను దాన్ని తీసుకోను’’ అని తేల్చి చెప్పేశాడు. ‘‘నువ్వు తీసుకోను అనడానికి లేదు. అది రూల్‌.. తీసుకుని తీరాలి’’ అని రవి చెప్పగానే.. మారుమాట్లాడకుండా సన్నీ దాన్ని తీసుకున్నాడు. అనంతరం స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ఒక్కడే కూర్చొని.. ‘‘బిగ్‌బాస్‌ సర్‌.. అందరూ నన్ను రెచ్చగొట్టి పంపిస్తారు. చివరికి నన్ను వెర్రి వాడిని చేస్తారు’’ అంటూ సన్నీ తనలో తానే మాట్లాడుకున్నాడు. ఇంతకీ రవికి వచ్చిన స్పెషల్‌ పవర్‌ ఏమిటి? దాని వల్ల సన్నీకి ఏదైనా ఉపయోగం ఉంటుందా?ఉండదా?తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే..!

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని