Big Boss OTT: ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ డ్రెస్సుపై విమర్శలు..!
బాలీవుడ్ నటిపై నెటిజన్ల విమర్శలు గుప్పిస్తున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి వస్త్రధారణపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇదేం డ్రెస్..’ అంటూ నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఆమె ఎవరంటే.. హిందీ ‘బిగ్‌బాస్ ఓటీటీ’ కంటెస్టెంట్ ఉర్ఫి జావేద్. అసలేమైందంటే.. ముంబయి విమానాశ్రయంలో ఆమె కనబడగానే కొందరు తమ కెమెరాలతో క్లిక్‌మనిపించారు. వీడియోలూ తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. నీలిరంగు బ్రాండెడ్ జీన్ ప్యాంటు, చొక్కా ధరించి నవ్వులు చిందిస్తూ కనిపించిందామె. అయితే, అందులో ఏముంది?అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. తను వేసుకున్న షర్ట్ కాస్త విభిన్నంగా ఉంటుంది. లోదుస్తులు కనిపించేలా ఆమె ఇలా స్టైలిష్ లుక్‌లో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారు?’, ‘ఇది ఫ్యాషనా?’, ‘భారతీయ సంస్కృతి, సంప్రదాయం మంటకలిశాయి’, ‘ఇది చాలా అసభ్యకరం’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
2016లో టీవీ కార్యక్రమం ‘బడే భయ్యా కీ దుల్హానియా’తో ఉర్ఫి నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘మేరీ దుర్గ’, ‘పంచ్ బీట్ సీజన్’ తదితర సిరీస్‌లతో సందడి చేసింది. ఈ ఏడాది ‘బిగ్‌బాస్ ఓటీటీ’లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి, 8వ రోజునే బయటకి వచ్చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Viveka Murder Case: నేడు హైదరాబాద్‌కు వివేకా హత్య కేసు నిందితులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Overseas Education: భారతీయ విద్యార్థుల గమ్యస్థానాలు అమెరికా, కెనడా, బ్రిటన్
-
World News
Video games: వీడియో గేమ్స్‌తో పిల్లల విజ్ఞాన సముపార్జన దెబ్బతినదు
-
Crime News
Andhra News: అనాథ దళిత యువతిపై వాలంటీరు అత్యాచారం
-
Ts-top-news News
TS EAMCET: ఇంటర్ ఫస్టియర్‌లో 70% సిలబస్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు