bigg boss 5: షణ్ముఖ్‌ ఎందుకు ఏడ్చాడు.. ఎలిమినేషన్‌ అలా డిసైడ్‌ అయింది!

ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో 10మంది నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో లోబో ఎలిమినేషన్‌ అంటూ సీక్రెట్‌ రూమ్‌కు పంపారు

Updated : 17 Oct 2021 18:53 IST

హైదరాబాద్‌: ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో 10మంది నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో లోబో ఎలిమినేషన్‌ అంటూ సీక్రెట్‌ రూమ్‌కు పంపారు. ఇక మిగిలిన 9మందిలో ఎలిమినేషన్‌ కత్తి నుంచి తప్పించుకుంది ఎవరు? బలైంది ఎవరు? ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా ఇదే చర్చ. ఈ వారం ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ శ్వేతవర్మ అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. మరోవైపు గతవారం ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’లో తయారు చేసిన బొమ్మలే ఈ వారం హౌస్‌మేట్స్‌ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. నాగార్జున కూడా అదే విషయం చెప్పారు. నామినేషన్స్‌లో ఉన్న 9మందికి బొమ్మలు ఇచ్చారు. ఎవరి ఫొటో అయితే బొమ్మలో ఉంటుందో వారు ఎలిమినేట్‌ అవుతారని చెప్పారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అయ్యారో తెలియాలంటే ఇంకొంత సేపు వేచి చూడాల్సిందే. అయితే, షణ్ముఖ్‌ మాత్రం బాధపడుతూ కనిపించాడు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న శ్వేతవర్మ ఎలిమినేట్‌ అయిందా? లేక బిగ్‌బాస్‌ ఏమైనా ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడా? తెలియాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని