Bigg Boss 5: మీద చేయెత్తకు అది పద్ధతి కాదు.. నువ్వు నాకు పద్ధతి నేర్పేవాడివా?

‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్స్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు కోపాన్ని ప్రదర్శించడంతో హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Updated : 08 Oct 2021 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్స్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు కోపాన్ని ప్రదర్శించడంతో హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ రోజు ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. తమకి నచ్చని (దోషిని) వారిని జైలుకి పంపమని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యుల్ని ఆదేశించాడు. ఈ క్రమంలోనే కొందరు దోషులుగా నిలబడ్డారు. విశ్వ-షణ్ముఖ్‌, శ్రీ రామచంద్ర- జశ్వంత్‌, కాజల్‌- రవి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాజల్‌పై ఉన్న కోపాన్ని మాటల్లో చెప్పకుండా అనీ మాస్టర్‌ చేతల్లో చూపించింది. కాజల్‌ ముఖంపై పోయాల్సిన నీళ్లని తన ముఖంపైనే పోసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకలా చేసింది? వీరిలో వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ఎవరు? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని