Bigg Boss Telugu 5: కాజల్‌.. రవిలలో ఎవరి కోసం సన్నీ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడాడు?

దాదాపు 85 రోజుల నుంచి హోరాహోరీగా తలపడి.. ప్రియమైనవారిని తలచుకుని బాధపడి.. ఇంతకాలం కాస్త కోపంగా, మరికాస్త నిరాశంగా ఉన్న ఇంటిసభ్యులు ఇప్పుడు ఎన్నడూ లేని ఉత్సాహంతో సందడి చేస్తున్నారు. ...

Updated : 28 Nov 2021 16:06 IST

హైదరాబాద్‌: దాదాపు 85 రోజుల నుంచి హోరాహోరీగా తలపడి.. ప్రియమైనవారిని తలచుకుని బాధపడి.. ఇంతకాలం కాస్త కోపంగా, మరికాస్త నిరాశంగా ఉన్న బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు ఇప్పుడు ఎన్నడూ లేనంత ఉత్సాహంతో సందడి చేస్తున్నారు. ఇంటిసభ్యులు, ప్రియమైనవారి రాకతో ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో వాతావరణం ఎంతో సరదాగా మారిన విషయం తెలిసిందే. చాలారోజుల తర్వాత తమ వారిని చూసి.. వారితో కొంతసమయం కేటాయించిన ఇంటి సభ్యులందరికీ ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. దాంతో సండే.. ఫన్‌డేలో వారంతా రెట్టింపు ఉత్సాహంతో ఆటలు ఆడారు. నాగార్జున ఇచ్చిన ఫన్నీ టాస్క్‌లను జోష్‌తో పూర్తి చేశారు. ఇందులో భాగంగా.. ‘‘షణ్ముఖ్‌ ఎంత  ఫ్రీగా అయిపోయాడో. ఎంత సరదాగా గెంతులేస్తున్నాడో’’ అని నాగ్‌ చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. మరి, ఇంత సరదాగా సాగుతోన్న ‘బిగ్‌బాస్‌’ గేమ్‌ నుంచి టాప్‌ 7లోకి ఎవరు అడుగుపెడుతున్నారు? ఈ వారం ఇంటి నుంచి బయటకు ఎవరు వస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని