Bigg Boss Telugu 5: ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్స్‌లోనే..

వారాలు గడిచే కొద్దీ తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షో యాభై రోజుల జర్నీని పూర్తి చేసుకుంది.

Updated : 02 Nov 2021 06:58 IST

హైదరాబాద్‌: వారాలు గడిచే కొద్దీ తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షో యాభై రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. సోమవారం వచ్చిందంటే చాలు ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారా? అని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ తరుణం రానే వచ్చింది. తాజాగా జరిగిన ఈ ప్రక్రియలో ఇద్దరు మినహా ఇంటి సభ్యులందరూ నామినేషన్స్‌లో ఉన్నారు.

‘ఇంట్లో ఉండేందుకు అర్హతలేని, హౌస్‌మేట్స్‌కు ఇష్టం లేని సభ్యులను బయటకు పంపే సమయం ఆసన్నమైంది. వాళ్లను బయటకు పంపడానికి తగిన కారణాలను చెప్పి ముఖానికి క్రీమ్‌ రాయాలి’ అని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో ప్రస్తుతం ఇంట్లో ఉన్న శ్రీరామ్‌, రవి, విశ్వ, ప్రియాంక, సిరి, కాజల్‌, మానస్‌, సన్నీ, అనీ, జెస్సీలు ఈ వారం నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. కెప్టెన్‌ అయిన కారణంగా షణ్ముఖ్‌ ఒక్కడే ఈ వారం నామినేషన్స్‌ నుంచి సేఫ్‌ అయ్యాడు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్‌ అవుతారు? ఎవరు వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ అవుతారు? చివరకు ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని