Bigg Boss Telugu 5: దమ్ముంటే ముందుకొచ్చి ఆడాలి? దొంగ బుద్ధులెందుకు? విశ్వ ఫైర్‌

సోమవారం బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్స్‌ గోప్యంగా జరిగినా, ఆ తర్వాత కిచెన్‌లో చోటు చేసుకున్న గొడవతో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Updated : 05 Oct 2021 17:48 IST

హైదరాబాద్‌: సోమవారం బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్స్‌ గోప్యంగా జరిగినా.. ఆ తర్వాత కిచెన్‌లో చోటు చేసుకున్న గొడవతో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా కెప్టెన్‌ శ్రీరామ్‌, జెస్సీ, షణ్ముఖ్‌, సిరిలు కాస్త గట్టిగానే గొడవపడ్డారు. అది సమసిపోయినట్లు కనిపిస్తుండగా, తాజాగా రవి, కాజల్‌లు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. గదిలో పడుకొని ఉన్న రవి, లోబోల దగ్గరకు వెళ్లిన కాజల్‌.. ‘నిన్న గొడవ జరిగింది దేనికి అంటే.. రవి, ఇంకా లోబో వాష్‌ రూమ్‌లో నుంచి లేచి, డిన్నర్‌లోకి రావడానికి’ అని సరదాగా ఆటపట్టించింది. అది కాస్తా చినికి చినికి గాలివానగా మారి, చివరకు తుపాను అయినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ సందర్భంగా ‘నేను సరదాగా అన్నాను’ అని కాజల్‌ చెప్పగా, ‘నీకు సరదానేమో, అవతలి వ్యక్తికి కాదు, అది తెలుసుకోకుండా ఎలా వస్తారు’ అని రవి స్వరం పెంచాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో రవి, సన్నీలు రాజులుగా నిలబడ్డారు. ఇంటిలోని హౌస్‌మేట్స్‌ కొందరు రవిని, మరికొందరు సన్నీకి సపోర్ట్‌ చేశారు. ఈ సందర్భంగా విశ్వ, మానస్‌ల మధ్య బురదలో మల్లయుధ్ధం జరిగింది. అనంతరం ఏదో విషయమై విశ్వ తీవ్రంగా స్పందించాడు. ‘దమ్ముంటే ముందుకొచ్చి ఆడాలి. ఆ దొంగ బుద్ధులెందుకు’ అంటూ ఫైర్‌ అయ్యాడు. మరి బిగ్‌బాస్‌ ఇచ్చిన ఆ కెప్టెన్సీ టాస్క్‌ ఏంటి? ఎవరు గెలిచారు? తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు