Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ సర్‌.. నాకోసం ఎవర్ని పంపిస్తున్నారో చెప్పండి: షణ్ముఖ్‌

టాప్‌ 8 కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్‌, కెప్టెన్సీ టాస్క్‌ ముగియడంతో ఇంటిసభ్యులందరికీ...

Updated : 24 Nov 2021 19:25 IST

హైదరాబాద్‌: టాప్‌ 8 కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ వారం నామినేషన్స్‌, కెప్టెన్సీ టాస్క్‌ ముగియడంతో ఇంటిసభ్యులందరికీ లగ్జరీ బడ్జెట్‌ కోసం బిగ్‌బాస్‌ ‘బీబీ ఎక్స్‌ప్రెస్‌’ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ‘చుక్‌ చుక్‌ చుక్‌’ అని బజర్‌ వచ్చిన ప్రతిసారీ ఇంటిసభ్యులందరూ రైలులా మారి బిగ్‌బాస్‌ ఇచ్చే కమాండ్స్‌ని ఫాలో అవుతూ ఇంటిలోపల పరిగెత్తాల్సి ఉంటుంది. బిగ్‌బాస్‌ ఫాస్ట్‌ ఫార్వడ్‌ అంటే ‘బీబీ ఎక్స్‌ప్రెస్‌’ స్పీడుగా పరిగెత్తాలి. టాస్క్‌ సమయంలో ఇంటిసభ్యులు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా.. ‘సన్నీ పాజ్‌’ అని బిగ్‌బాస్‌ సూచించాడు. దీంతో రవి-శ్రీరామ్‌ సన్నీతో ఓ ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంటిసభ్యులందర్నీ పాజ్‌ చేయడంతో చివరికి షణ్ముఖ్‌.. వాళ్లందర్నీ సరదాగా ఆటపట్టించాడు. నామినేషన్స్‌, కెప్టెన్సీ టాస్క్‌లో ఆగ్రహావేశాలతో కనిపించిన ఇంటిసభ్యులు ఈ టాస్క్‌లో ఎంతో సరదాగా నవ్వుతూ కనిపించారు. ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకున్నారు. కాజల్‌, శ్రీరామచంద్ర కుటుంబ సభ్యులు ‘బిగ్‌బాస్‌’ హౌజ్‌కి విచ్చేశారు. తన కూతుర్ని చూడగానే కాజల్‌ భావోద్వేగానికి గురైంది. అనంతరం ‘నా కోసం ఎవర్ని పంపిస్తున్నారో చెప్పండి సర్‌’ అని షణ్ముఖ్‌.. బిగ్‌బాస్‌ని అడిగాడు. 

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని