Bigg Boss Telugu 5: సన్నీ వీడియో బయట పెట్టిన నాగార్జున.. అనీ మాస్టర్‌కు అదిరే పంచ్‌

ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల ఆరోపణలు, ప్రత్యారోపణలపై నాగార్జున పంచాయతీ

Updated : 13 Nov 2021 19:56 IST

హైదరాబాద్‌: ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల ఆరోపణలు, ప్రత్యారోపణలపై నాగార్జున పంచాయతీ షురూ అయింది. శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. కెప్టెన్‌ అయిన రవి పోలీస్‌ క్యాప్‌ ధరించి సన్నీని జైలులో వేశాడు. ‘బ్యాడ్‌ బిహేవియర్‌.. లూజ్‌ టంగ్‌.. ఇష్టమొచ్చింది మాట్లాడతా.. ఇష్టం వచ్చింది చేస్తా అంటాడు. నా వరకూ చాలా తప్పు అనిపిస్తోంది సర్‌’ అని సన్నీపై రవి ఆరోపణలు చేశాడు. ‘తంతా’ అనే పదం సన్నీ వాడాడని రవి అనగా, ‘లేదు సర్‌’ అని సన్నీ సమాధానం ఇచ్చాడు. దీంతో నాగార్జున ఆ వీడియోను ప్లే చేయడంతో సన్నీ తెల్లముఖం వేశాడు. ‘సన్నీ వ్యక్తిగతంగా అలా అనడు సర్‌. గేమ్‌ ఆడేటప్పుడు కోపంలో మాటలు వచ్చేస్తాయి’ అంటూ అనీ మాస్టర్‌ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, ‘కోపంలో ఏదైనా అంటాడా. అయితే, కాజల్‌పై నువ్వు అన్నమాట కూడా సరైనదేనా’ అని నాగార్జున అనేసరికి అనీ మాస్టర్‌ షాక్‌లో ఉండిపోయింది.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని