Cinema News: బిగ్‌బాస్‌ విన్నర్‌ సిద్దార్థ్‌ కన్నుమూత

బాలీవుడ్‌ నటుడు, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-13’ సీజన్‌ విజేత సిద్దార్థ్‌ శుక్లా (40) కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటుకు గురైన ఆయన్ని కుటుంబసభ్యులు వెంటనే ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు...

Updated : 02 Sep 2021 14:24 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-13’ సీజన్‌ విజేత సిద్దార్థ్‌ శుక్లా (40) కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటుకు గురైన ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిద్ధార్థ్‌ ఆకస్మిక మరణంతో బీటౌన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సెలబ్రిటీలు వరుస ట్వీట్లు పెడుతున్నారు. సిద్దార్థ్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

అశోక్‌-రీతా శుక్లా దంపతులకు 1980 డిసెంబర్‌ 12న సిద్దార్థ్‌ జన్మించారు. ఇంటీరియర్‌ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల్లో సహాయ నటుడిగా సిద్దార్థ్‌ నటించారు. ‘బాలికా వధు’, ‘దిల్‌ సే దిల్‌ తఖ్‌’ ధారావాహికలతో ఆయన బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘బిగ్‌బాస్‌-13’ అనంతరం ఆయన చివరిగా కనిపించిన షో ‘బ్రోకన్‌ బట్‌ బ్యూటీఫుల్‌ 3’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని