
Bigg Boss Telugu 5: నేను డ్రామా క్వీన్ కాదు.. నా చేతుల్లో గేమ్ ఉంది ఆడతా!
ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్బాస్’. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా 5వ సీజన్ ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. నామినేషన్ల పర్వంతో వేడెక్కిన హౌస్లో ఈ రోజు ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ విశేషాలు చెప్పేందుకే ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో కొంచెం ఫన్నీగా, కొంచెం సీరియస్గా సాగింది. ‘హమీదాతో రెండు పాయింట్లే అని నేను సైగ చేసి చెప్తే.. తను నువ్వు చెప్పి చావు’ అందని సన్నీ కామెడీ పండించాడు. ‘బ్రేకప్ బ్రో.. బ్రదర్, సిస్టర్ల బ్రేకప్ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా’ అని కాజల్ తన మనసులో మాట తెలిపింది. ‘గేమ్ అంటే ఏంటి? ఇది గేమా. ఇది కరెక్ట్ కాదు’ అని శ్వేత తన కోపాన్ని ప్రదర్శించింది. ‘ఐన్స్టీన్ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నమైనా చేయొచ్చేమో కానీ వీళ్ల నామినేషన్లని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేం. అవి అర్థంకావు’ అని షణ్ముఖ్, జెస్సీ మాట్లాడుకున్నారు. మరి కాజల్ ఎందుకు బ్రేకప్ చెప్పింది? శ్వేత ఎవరిపై అంతలా ఫైర్ అయింది? తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే...