Bigg boss telugu 5: నీ గేమ్‌ నువ్వు ఆడుకో.. నా దగ్గరకు రావొద్దు: యానీ మాస్టర్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో మరో వివాదం రాజుకుంది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా సన్నీ-షణ్ముఖ్‌ల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ‘‘దమ్ముంటే ఫైట్‌ చేసుకుందాం రా’’ అంటూ ఒకరితో ఒకరు గొడవకు దిగారు....

Updated : 12 Nov 2021 18:26 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో మరో వివాదం రాజుకుంది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా సన్నీ-షణ్ముఖ్‌ల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ‘‘దమ్ముంటే ఫైట్‌ చేసుకుందాం రా’’ అంటూ ఒకరితో ఒకరు గొడవకు దిగారు. కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన ఇంటిసభ్యులకు ‘టవర్‌లో ఉంది పవర్‌’ అనే టాస్క్‌ ఇస్తున్నట్లు బిగ్‌బాస్‌ సూచించాడు. అందులో విజయం సాధించిన ఇంటిసభ్యుడు ఈ వారం కెప్టెన్‌ కానున్నాడు.

టాస్క్‌లో భాగంగా కెప్టెన్సీ పోటీదారులు హోరాహోరీగా తలపడ్డారు. పోటీదారులకు మిగతా ఇంటిసభ్యులు సాయం చేయవచ్చని.. అలాగే ప్రత్యర్థి పోటీదారులను అన్నివిధాలుగా నిలువరించవచ్చని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో టాస్క్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సన్నీ, సిరిల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ‘‘కెప్టెన్సీ పోటీదారులకు సాయం చేసేవాళ్లని కావాలంటే పట్టుకో. అంతేకానీ ఆటలో ఉన్న నన్ను ఎలా ఆపుతావు’’ అని సన్నీ.. సిరిని ప్రశ్నించగా.. ‘‘ఇది నా స్ట్రాటజీ’’ అంటూ ఆమె వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. దాంతో ఆగ్రహానికి లోనైన సన్నీ.. ‘‘నేను గేమ్‌ ఆడటం ప్రారంభిస్తే.. అప్పడం అయిపోతావు’’ అంటూ ఆమెపై కేకలు వేశాడు. ‘‘తను ఏం అనలేదు కదా’’ అని షణ్ముఖ్‌.. సన్నీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ‘‘నువ్వు ఆగు.. దమ్ముంటే ఫైట్‌ చేసుకుందాం రా. ఆడపిల్లని పంపించి నువ్వు మాట్లాడటం కాదు. చేతకాని ఆటలు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చి.. నీకెంట్రా గౌరవమిచ్చేది’’ అంటూ సన్నీ ఆవేశంతో ఊగిపోయాడు.Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని